Sita Ramam | గతేడాది హైయెస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్‌లో సీతారామం ఒకటి. అసలెలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కట్టారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా వచ్చిందంటూ థియేటర్లకు పరుగులు తీశారు. ఇప్పటికే సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న ఈ సినిమా తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా సీతారామం నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు మరో ఎనిమిది రోజుల పాటు జరుగనున్నాయి. ఇక ఇదే అవార్డ్ ఫంక్షన్లో మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకుంది.
సీతారామం రిలీజయ్యే నాటికి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు. పైగా దర్శకుడు హను రాఘవపూడికి గతంలో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేదు. ఇక దుల్కర్‌కు క్రేజ్ ఉంది కానీ, మరీ హీరోగా సినిమాను తన భుజాలపై నడిపించే అంత పాపులారిటీ లైదు. దానికి మించి ఇక్కడ దుల్కర్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ కూడా లేదు. ఇక మృనాళ్ ఠాకూర్‌ను చూడటమే మొదటి సారి. కాస్తో కూస్తో ఈ సినిమాపై బజ్ వచ్చిందంటే దానికి రష్మిక మందనే కారణం. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లకు కూడా పెద్దగా హైప్ ఏమీ తీసుకురాలేదు.
కట్ చేస్తే తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు. దుల్కర్, మృనాళ్ నటనకు తెలుగు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. డైరెక్టర్ హను టేకింగ్, విజన్‌కు ఫిదా అయిపోయారు. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌తో థియేటర్లు కిక్కిరిపోయాయి. విమర్శకులు ప్రశంసలు పొందిన ఈ సినిమా కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.35 కోట్ల బ్రేక్ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్లో ఏకంగా రూ.90 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.