Sir Movie | ఈ మధ్య కాలంలో ఎంత సూపర్ హిట్టయిన సినిమా అయినా సరే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. దర్శక, నిర్మాతలు కూడా రిలీజ్‌కు ముందే ఓటీటీ సంస్థలతో డీల్ కుదురించుకుంటున్నారు. ఒకవేళ సినిమా తేడా కొడితే.. మరో డీల్‌తో రెండు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ మధ్య థియేటర్లలో కంటే ఓటీటీలపైనే ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్ వస్తే చాలు కొత్త సినిమాలు ఏవి రిలీజయ్యాయని తెగవెతికేస్తున్నారు. కాగా శుక్రవారం రెండు కొత్త సినిమాలు ఓటీటీ ప్రియులను పలకరించాయి.
ఎన్నో ఏళ్ల నుంచి ధనుష్ సినిమాలు తెలుగులో విడుదలవుతున్నా.. కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించలేకపోతున్నాయి. ఆ కల సార్ సినిమాతో తీరిపోయింది. తిరుతో పర్వాలేదనిపించలే కలెక్షన్లతో లాక్కొచ్చినా సార్ మాత్రం ధనుష్‌కు తెలుగులో తిరుగులేని మార్కెట్‌ను క్రియేట్ చేసింది. నిజానికి తమిళంతో పోల్చితే తెలుగులోనే ఈసినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా గతరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
కలర్ ఫోటో సినిమాతో హీరోగా అవతారమెత్తిన సుహాస్‌కు తొలిసినిమానే తిరుగులేని విజయం సాధించింది. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆధరించారు. ఆయన నటించిన ‘రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న థియేటర్లో రిలీజై సంచలనం విజయం సాధించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఫైనల్ రన్లో దాదాపు పది కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. పోటీగా మైఖేల్, బుట్టబొమ్మ వంటి సినిమాలున్నా.. ఫ్యామిలీ ఆడియోన్స్ రైటర్‌కే ఓటెశారు. కాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో రైటర్ పద్మభూషణ్ స్ట్రీమింగ్ అవుతుంది.