Singham Again | సింగం ఎగైన్ షూటింగ్ ప్రారంభం.. ఈ సారి మరింత స్పైసీగా..!
Singham Again | పుష్కర కాలం కిందట బాలీవుడ్లో వచ్చిన సింగం సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్.
Singham Again | పుష్కర కాలం కిందట బాలీవుడ్లో వచ్చిన సింగం సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సింగం సిరీస్‌లో మూడో పార్టు తెరకెక్కుతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ తాజాగా పట్టాలెక్కింది.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. దీనికి సింగం ఎగైన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. లాంచ్ ఈవెంట్‌కు అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టితో పాటు హీరో రణ్వీర్ సింగ్ హాజరయ్యారు. ఇక ఈ మూడో ఇన్స్టాల్మెంట్లో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు అక్షయ్ కుమార్ , రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సారి బడ్జెట్ కూడా రెట్టింపు అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దీపికా హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ‘సింగం-3’లో దీపికా లేడీ పోలీస్ అధికారిగా నటించనుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత దీపికా దాదాపు 9ఏళ్ళకు రోహిత్ శెట్టి దర్శకత్వంలో సినిమా చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

