Sonu Nigam | బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్‌పై మరోసారి దాడి జరిగింది. ముంబైలోని ఓ ఈవెంట్లో పాల్గొన్న అతనిపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సోనూ నిగమ్‌తో పాటు అతని స్నేహితులు, బాడీగార్డుకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబైలోని చెంబూరులో నిర్వహించిన సంగీత్ కచేరిలో తన బృందంతో కలిసి సోనూ నిగమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్లపై నుంచి దిగొస్తున్న సోనూ నిగమ్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒక్కసారిగా జనం దూసుకురావడంతో సెల్ఫీలు దిగేందుకు సెక్యూరిటీ నిరాకరించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సోనూ నిగమ్ స్నేహితుడు రబ్బానీ ఖాన్‌ను కిందపడేశారు. అప్పుడే సెక్యూరిటీతో పాటు సోనూ నిగమ్‌పై కూడా దాడి జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది. ప్రస్తుతం సోనూ నిగమ్ సురక్షితంగానే ఉన్నారు. అయితే ఇది నిజంగా తోపులాటేనా? లేదా ప్లాన్ ప్రకారం దాడికి యత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
लाइव शो के दौरान गायक सोनू निगम पर उद्धव ठाकरे के विधायक प्रकाश फातेरपेकर के बेटे ने किया हमला. सोनू निगम और उनके भाई को आई चोट. मस्जिद से लाउडस्पीकर हटवाने की माँग करने के बाद से निशाने पर थे सोनू. #Sonunigam pic.twitter.com/E80uvsn2ZX
— Himanshu Mishra 🇮🇳 (@himanshulive07) February 20, 2023