అరసన్ కోసం ఆరు గెటప్పులు?
కోలీవుడ్‌లో విభిన్నకథాచిత్రాల దర్శకుడిగా వెట్రిమారన్‌కి పేరుంది. ఆయన డైరెక్షన్లో నటించేందుకు నటీనటులు ఎక్కువగా ఆసక్తి చూపించడానికి కారణం అదే. ఆ అవకాశం ఇప్పుడు హీరో శింబుని వరించింది.
కోలీవుడ్‌లో విభిన్నకథాచిత్రాల దర్శకుడిగా వెట్రిమారన్‌కి పేరుంది. ఆయన డైరెక్షన్లో నటించేందుకు నటీనటులు ఎక్కువగా ఆసక్తి చూపించడానికి కారణం అదే. ఆ అవకాశం ఇప్పుడు హీరో శింబుని వరించింది. ప్రస్తుతం ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ అనే సినిమా చేస్తున్నారు. కలైపులి థాను నిర్మాత. వెట్రిమారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శింబు విభిన్నమైన ఆరు గెటప్పుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మూడు గెటప్పులకు చెందిన షూటింగ్ పూర్తి చేసినట్టు తెలిసింది. ఉత్తర చెన్నైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది.
అధికార పోరాటాలు, భీకరమైన ముఠా కక్ష్యల నేపథ్యంలో.. వెట్రిమారన్ బ్లాక్‌బస్టర్ ‘వడా చెన్నై’ ప్రపంచాన్ని పునరావిష్కరించేలా ఈ కథ ఉంటుందని వినికిడి. ఈ సినిమా గురించి హీరో శింబు మాట్లాడుతూ ‘ప్రేక్షకులపై ‘దురంధర్’ ఫ్రాంచైజీ ఎంతటి ప్రభావం చూపించిందో.. లార్జర్ దేన్ లైఫ్‌గా సాగే ఈ సినిమా కూడా అంతటి ప్రభావం చూపుతుంది. ఈ కథ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రీకరణ ఇంకా మిగిలివున్నందున ఆ టైమ్‌కి రిలీజ్ కావడం కష్టమే అని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

