Simba | పర్యావరణ ప్రయోజనాన్ని తెలియజెప్పాం
అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింబా’. సంపత్‌నంది అందిచిన ఈ కథకు మురళీమనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65శాతం మంది చనిపోతున్నారు.
Simba | అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింబా’. సంపత్‌నంది అందిచిన ఈ కథకు మురళీమనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65శాతం మంది చనిపోతున్నారు. సిగరెట్, మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేది పాతికరెట్లు ఎక్కువ. మొక్కలు మనతోనే ఉంటాయి. మనతో పాటు పెరుగుతాయి. మన తరువాత కూడా ఉంటాయి’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ ఆసక్తిగా సాగింది.
పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేస్తూ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నదని, ఈ సినిమా ప్రజల్లో మార్పు తీసుకొస్తే చాలా సంతోషమని అనసూయ చెప్పింది. ప్రకృతిని కాపాడుకొని, భవిష్యత్తు తరానికి మంచి ప్రపంచాన్ని అందించాలనే స్ఫూర్తిదాయక కథతో ఈ సినిమా తీశామని నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో అరుదుగా సినిమాలు వస్తుంటాయని సంగీత దర్శకుడు కృష్ణసౌరభ్ అన్నారు. ఈ చిత్రాన్ని సంపత్‌నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

