మౌనమే నా సమాధానం

చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని అంటోంది అంజలి. సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని చెబుతోంది. నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను అంజలి ఖండిచింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తానేప్పుడూ భావించుకోనని అంటోంది. అంజలి మాట్లాడుతూ ‘సినీపరిశ్రమలో అవకాశాల విషయంలో ప్రతిభ ఒక్కటే కొలమానంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి దక్కాల్సిన సినిమాలు వారినే వరిస్తాయి. ఇతరులు చేస్తోన్న మంచి పాత్రలు నాకు దక్కితే బాగుంటుందని ఆశపడటంలో అర్థంలేదు. రాసిపెట్టుంటే తప్పకుండా ఆ అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నా సినీ ప్రయాణంలో అనుష్క, సమంతతో పాటు చాలా మంది నాయికలతో కలిసి నటించాను. వారిని నా స్నేహితులుగా భావించాను తప్పితే పోటీదారులుగా ఏనాడూ ఊహించలేదు. సీనియర్లతో పాటు నూతన హీరోయిన్ల నటనను చూస్తూ నాలోని తప్పుల్ని సరిదిద్దుకుంటా. నాయికల మధ్య పోటీ గురించి అడిగితే మౌనమే నా సమాధానంగా భావిస్తా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anjali
- Competition
- Silence
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

