Sid-Kiara | బాలీవుడ్ లవ్ బర్డ్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం సిద్ధార్థ్ కొత్త పెళ్లి కూతురుతో కలిసి తొలిసారిగా ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నాడు.
నవ వధువు కియారాకు అత్తవారింట్లో పూలవర్షం కురిపిస్తూ.. డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌తో పాటు కియా కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లితో ఒక్కటైన నవ దంపతులకు అభిమానులు నెటిజన్లు, పలువురు సినీతారలు, ప్రముఖులు వివాహా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కుటుంబ సభ్యులు, బాలీవుడ్, వివిధ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ఢిల్లీతో పాటు ముంబయిలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.