9 రోజులు నిద్ర పోకుండా ఘోరంగా మారిన ఫేమస్ నటుడు..!

సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. కథ డిమాండ్ చేస్తే వాళ్లేమైనా చేస్తుంటారు. అలాంటి వాళ్ళనే ప్రేక్షకులు కూడా బాగా గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నటుడు కూడా అంతే. మనకు బాగా తెలిసిన నటుడే ఈయన. కానీ ఓ సినిమా కోసం అలా మారిపోయాడు. అతనెవరో గుర్తు పట్టారా.. కాస్త జాగ్రత్తగా గమనిస్తే గుర్తుకొస్తాడు.. అతడే కిక్ శ్యామ్. రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు శ్యామ్. దానికంటే ముందే తమిళంలో 10 సినిమాల వరకు నటించాడు ఈయన. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులో కిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత దాదాపు డజన్ సినిమాలు చేసాడు ఈయన.
అందులో రేసుగుర్రం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని సినిమాల్లోనూ కారెక్టర్ ఆర్టిస్టుగా బాగానే అలరించాడు. మధ్యలో వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడుదుడుకులు వచ్చాయి. ఈయన డ్రగ్స్ సప్లై చేస్తున్నాడంటూ పోలీసులు కూడా అరెస్ట్ చేసారు. అయినా కూడా కెరీర్ ను గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నాడు శ్యామ్. ఈ మధ్యే ఓ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు ఈయన. అసలు గుర్తు కూడా పట్టకుండా అయిపోయాడు. సినిమాలో కారెక్టర్ కోసం నిద్ర కూడా మానేసాడు. దర్శకుడు కథ చెప్పగానే నచ్చి గ్రాఫిక్స్ కూడా వద్దన్నాడు. అందులో కారెక్టర్ కోసం కళ్లు బాగా లావుగా అవ్వాలి.. కళ్ల కింద గడ్డలు కనిపించాలి.. అనుకుంటే ఇవన్నీ గ్రాఫిక్స్ లో కూడా చేయొచ్చు.
అది చాలా ఈజీ. మేకప్ టీం గంట సేపు కూర్చుంటే అయిపోతుంది. కానీ ఈయన మాత్రం అలా కాదు.. ఒరిజినల్ గా అలా అయిపోతానంటూ దర్శక నిర్మాతలకు చెప్పాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా. ఈ లుక్ కోసం ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 రోజులు నిద్ర పోకుండా ఉండిపోయాడు. దానివల్ల కంటి కింద పెద్ద పెద్ద మచ్చలతో పాటు గడ్డలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ లుక్ వీడియో వైరల్ అవుతుంది. కారెక్టర్ కోసం ఇంతగా తపించిపోయే నటులు ఇంకా ఉన్నారా అని ఇలాంటి వాళ్లను చూసినపుడే అర్థమవుతుంది. ఏదేమైనా కూడా కిక్ శ్యామ్ చేసిన పని చూసి అంతా హ్యాట్సాఫ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor shyam
- shyam
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

