Shruti Haasan | ‘నేను ఎవరితోనూ రిలేషన్లో లేను’.. రూమర్లపై శృతి హాసన్ క్లారిటీ!
Shruti Haasan | స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ పలు వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆమె రిలేషన్షిప్ గురించి గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారాలపై స్వయంగా శృతి హాసన్ స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్‌కు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
Shruti Haasan | స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ పలు వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆమె రిలేషన్షిప్ గురించి గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారాలపై స్వయంగా శృతి హాసన్ స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్‌కు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రస్తుతం మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా? అని ప్రశ్నించగా, శృతి ఎలాంటి సందేహాలకు తావులేకుండా సమాధానం ఇచ్చారు.నేను ప్రస్తుతం ఎవరితోనూ, ఎలాంటి రిలేషన్షిప్లో లేను అని శృతి హాసన్ స్పష్టం చేశారు. దీంతో ఆమె డేటింగ్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.
అలాగే మరో అభిమాని, నటిగా కాకపోతే ఏ వృత్తిని ఎంచుకునేవారని అడగగా, చిన్నపిల్లల మానసిక వైద్యురాలిగా (చైల్డ్ సైకాలజిస్ట్) మారాలనుకునేదానిని అని శృతి తెలిపారు. ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకప్పుడు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శృతి హాసన్ గత కొంతకాలంగా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తక్కువ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ, తన అభిమానులతో మాత్రం సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.
ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలో శృతి హాసన్ ప్రత్యేక పాటలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్గా ఆమె నటించనున్న ‘సలార్ 2’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు శృతి హాసన్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

