మా బంధం ప్రత్యేకం

అగ్ర కథానాయిక శృతిహాసన్ డేటింగ్ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారాయి. చిత్రకారుడు శంతను హజారికాతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని అంటున్నారు. గత కొన్ని మాసాలుగా ఈ జంట సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. శంతను హజారికాతో కలిసి తీయించుకున్న ఫొటోల్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది శృతిహాసన్. తమ జన్మదిన వేడుకల్ని కూడా ఈ జోడీ కలిసే జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు. ఈ సరికొత్త ప్రేమాయణంపై శృతిహాసన్ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ప్రేమలో ఉన్నాననే విషయాన్ని నేరుగా చెప్పకుండా తన జీవితంలో ఇదొక అద్భుతమైన దశ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘డేటింగ్ కాన్సెప్ట్ గురించి నాకు పెద్దగా తెలియదు. నా జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని ఎప్పుడూ దాచుకోలేదు. సినీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అన్ని విషయాల్లో ఓపెన్‌గా ఉండాలని కోరుకుంటా. శంతనుతో నాకు గొప్ప స్నేహబంధం ఉంది. అతను తన వృత్తిలో ప్రతిభావంతుడు. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మా ఇద్దరి అభిరుచులు బాగా కలిశాయి’ అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు ప్రేమలో ఉన్నాననే విషయాన్ని రూఢీ చేస్తున్నాయని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

