ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి
దాదాపు ప్రతి సెలబ్రిటీకి సోషల్ మీడియాలో ట్రోలర్స్ బెడద తప్పడం లేదు. తారల పబ్లిక్ లైఫ్‌లో ఏ సందర్భం దొరుకుతుందా..దాన్ని విమర్శిద్దామా అన్నట్లు ట్రోలర్స్ వేచి చూస్తుంటారు.
దాదాపు ప్రతి సెలబ్రిటీకి సోషల్ మీడియాలో ట్రోలర్స్ బెడద తప్పడం లేదు. తారల పబ్లిక్ లైఫ్‌లో ఏ సందర్భం దొరుకుతుందా..దాన్ని విమర్శిద్దామా అన్నట్లు ట్రోలర్స్ వేచి చూస్తుంటారు. ఇటీవల తన సినిమా ‘దృశ్యం 2’ ప్రచార కార్యక్రమంలో నాయిక శ్రియాను ఆమె భర్త వేదిక మీదే ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ట్రోలింగ్‌పై శ్రియా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఆమె స్పందిస్తూ…‘ఇందులో విమర్శించేందుకు ఏముందో అర్థం కావడం లేదు. నా భర్త నన్ను ముద్దు పెట్టుకోవడం ఎలా తప్పవుతుందో తెలియడం లేదు.
ముద్దును కూడా విడ్డూరంగా చూసే వాళ్లు ఈ తరంలోనూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా విమర్శించడం వారి పని, దాన్ని చూసీ చూడనట్లు వదిలేయడం నా పని. ఎవరేమనుకున్నా నా మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాను. మా ఆయనకు నేను నటించిన సినిమాలు ఇష్టం. ఆయన ‘ఆర్ఆర్ఆర్’, ‘దృశ్యం 2’ చిత్రాలు చూశారు. భాష రాకపోవడం వల్ల ఒకటికి రెండు సార్లు సినిమాలు చూస్తే గానీ అర్థం కావని నాతో చెబుతుంటారు. ఈ కథా కథనాలను ఆయనకు అర్థమయ్యేలా చెబుతుంటాను’ అని చెప్పింది. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను శ్రియా 2018లో వివాహం చేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

