అగ్ర హీరో రవితేజ తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చిత్రీకరణ 50శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్టంట్ కొరియోగ్రాఫర్ సతీష్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా గురువారం ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే సినిమా ఇదని పోస్టర్ చెబుతున్నది. ఈ పోస్టర్లో కూతురుతో కలిసి ముచ్చట్లు చెబుతూ నడుస్తున్న రవితేజను చూడొచ్చు. ఈ పోస్టర్లో ఆయన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. రవితేజ కెరీర్లోనే భిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారని, అయ్యప్పమాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబ నేపథ్యం కూడా ఉంటుందని, బలమైన భావోద్వేగాలతో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు.
ప్రియా భవానీశంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్‌ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.