రవిబాబు, ఏస్తర్, ఆమని, రాశి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షూటర్’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శెట్టిపల్లి శ్రీనివాసులు తెరకెక్కించారు. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘పవర్ఫుల్ పోలీస్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆద్యంతం అనూహ్య మలుపులతో కథ సాగుతుంది. సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఈ సినిమాలో భాగమయ్యారు’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డ్రమ్స్ రాంబాబు, నిర్మాత, దర్శకత్వం:
శెట్టిపల్లి శ్రీనివాసులు.