Shivaraj kumar | తమ్ముడికి డబ్బింగ్..ఎమోషనల్ అయిన స్టార్ హీరో
తన సినిమాలు, సామాజిక కార్యక్రమాలతో ఎప్పుడూ జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar). పునీత్ చివరిసారి నటించిన చిత్రాల్లో జేమ్స్ సినిమా ఒకటి.

భౌతికంగా మన మధ్య లేకపోయినా..తన సినిమాలు, సామాజిక కార్యక్రమాలతో ఎప్పుడూ జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar). తన యాక్టింగ్, డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పునీత్‌రాజ్ కుమార్ చివరిసారి నటించిన చిత్రాల్లో జేమ్స్ సినిమా ఒకటి. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్ జయంతి (Puneeth birth anniversary)సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే జేమ్స్ (James ) చిత్రం డబ్బింగ్ మినహా అన్ని ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే పునీత్ లాంటి వాయిస్‌తో తెరపై వినోదాన్ని పండించడం ఇపుడు దర్శకనిర్మాతలకు టఫ్ టాస్క్ అయిపోయింది.
పునీత్ పాత్రకు డబ్బింగ్ చెప్పే సరైన వ్యక్తి కోసం తీవ్రంగా శ్రమించిన మేకర్స్ ఫైనల్‌గా ఓ స్టార్ హీరోను ఎంపిక చేశారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనే కదా మీ డౌటు. ఇంకెవరో కాదు పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ (Shivaraj kumar). ఈ ప్రాజెక్టు గురించి శివరాజ్ కుమార్ ఎమోషనల్‌గా స్పందించిన కామెంట్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పునీత్ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని, అయితే ప్రేక్షకులు తన వాయిస్‌ను అంగీకరిస్తారో..? లేదోనని సంశయం వ్యక్తం చేశాడు శివరాజ్ కుమార్.
కొన్ని సన్నివేశాలకు స్క్రీన్ పై పునీత్ రాజ్ కుమార్ ను చూసి డబ్బింగ్ చెబుతుంటే ఎమోషనల్‌గా ఛాలెంజింగ్‌గా మారిందని చెప్పుకొచ్చాడు శివరాజ్‌కుమార్. పునీత్‌తోపాటు శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. పునీత్ మరో సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కీ రోల్ పోషించడం విశేషం. జేమ్స్ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేసి..పునీత్‌రాజ్ కుమార్ కు ఘనంగా నివాళులర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

