ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే…?

This week release movies | విశాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సామాన్యుడు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరి బ్యానర్లో విశాల స్వియ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.ఇప్పటికే విడుదలచేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.యువన్ శంకర్ రాజా సంగీతం వహిస్తున్న ఈ చిత్రం గణతంత్రదినోత్సవం సందర్భంగా జనవరి26న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
శ్రీకాంత్ హీరోగా డింపుల్ చోప్రా,నటాషా దోశీ, రాజీ సిన్హా హీరోయిన్లు గా నటిస్తున్న తాజా చిత్రం కోతలరాయుడు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటరమణ మూవీస్ బ్యానర్ పై ఎస్.శంకర్,కొలన్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రీతమే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదలవాయిదా పడుతూ వస్తుంది.తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మాటలతో మాయ చేసే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడని అందుకే ఈ చిత్రానికి కోతల రాయుడు అనే టైటిల్ ను పెట్టామని దర్శక నిర్మాతలు చెప్పుకోచ్చారు.
కిచ్చా సుధిప్, మడోన్నా సెబాస్టియస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం K3 కోటికొక్కడు. శివ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేయస్ మీడియా సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రద్ధా దాస్, రవి శంకర్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అర్జున్ జన్యా, సినిమాటోగ్రఫర్:శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని.
శ్రీమానస్, సమ్మోహన హీరో హీరోయిన్లు నటిస్తున్న తాజా చిత్రం P3పటారు పాళెం ప్రేమకథ . దొరై రాజు వూపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జే.ఎస్ రెడ్డి సమర్పణలో దొరై రాజు స్వియంగా నిర్మిస్తున్నాడు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి4 న థియేటర్లలో విడుదలచేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం:బాలు దాకె. దర్శకత్వం:దొరై రాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

