శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘డాక్టర్’. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కోటపాడి రాజేష్. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ మాస్ అంశాలతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. గతంలో శివకార్తికేయన్‌తో మేము తీసిన ‘శక్తి’ ఘనవిజయం సాధించింది. తప్పకుండా ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. ప్రియాంక అరూల్ నాయికగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్