బలగం మనస్విని
ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తరు సెలెబ్రిటి. ‘బలగం’ మనస్విని అంటే జనం ఇట్టే గుర్తుపడతారు. తనది తంగళ్లపల్లి. ఆసాని లక్ష్మారెడ్డి- రవీన.. మనస్విని తల్లిదండ్రులు. పక్కా రైతు కుటుంబం. చిన్నప్పుడే ఈటీవీ ‘జబర్దస్త్'లో మెరిసింది. జీ తెలుగు ‘డ్రామా జూనియర్'లో ‘బామ్మ’గా వామ్మో అనిపించుకుంది.
‘బలగం’ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో చెల్లి పాత్రలో మెరిసిన ఓ చిన్నారి గుర్తుండే ఉంటుంది. తన పేరు మనస్విని. ఊరు తంగళ్లపల్లి. ఇప్పటికే ‘డ్రామా జూనియర్’లో కామా, ఫుల్స్టాప్ లేకుండా డైలాగులు వల్లించింది.

మనస్విని..
ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తరు సెలెబ్రిటి. ‘బలగం’ మనస్విని అంటే జనం ఇట్టే గుర్తుపడతారు. తనది తంగళ్లపల్లి. ఆసాని లక్ష్మారెడ్డి- రవీన.. మనస్విని తల్లిదండ్రులు. పక్కా రైతు కుటుంబం. చిన్నప్పుడే ఈటీవీ ‘జబర్దస్త్’లో మెరిసింది. జీ తెలుగు ‘డ్రామా జూనియర్’లో ‘బామ్మ’గా వామ్మో అనిపించుకుంది. ‘ఆధార్ కార్డు’ పాత్రలో భలేగా ఇమిడిపోయింది. తాజాగా ‘బలగం’సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. హీరో చెల్లిగా సహజ నటన ప్రదర్శించింది. ‘పొట్టి పిల్లా..’ పాటలో చిరునవ్వులతో ఆకట్టుకుంది. డైరెక్టర్ యెల్డండి వేణు ‘బలగం’లో అవకాశం ఇచ్చి, తన జీవితాన్ని మలుపు తిప్పాడని సంతోషంగా చెబుతుంది మనస్విని. ‘ప్చ్.. ఒకట్రెండు మంచి డైలాగులు పడితే బావుండేది. అయితేనేం, సినిమా మొత్తం నా క్యారెక్టర్ కనిపిస్తుంది’ అంటుంది మనస్విని సంబురంగా. మనస్విని నటనను హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య మెచ్చుకున్న సందర్భాలు అనేకం.

చదువు తర్వాతే..
‘చిన్నప్పటి నుంచీ నటన అంటే ఇష్టం. పంద్రాగస్టు వేడుకలు, వినాయక నవరాత్రుల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. బలగంలో నటించమని ఇంటికొచ్చి మరీ అడిగారు. డైరెక్టర్ వేణుది సిరిసిల్లనే. సినిమాలో చాలామంది చుట్టుపక్కల గ్రామాల వాళ్లు నటించారు. దీంతో నాన్న అంగీకరించారు. వేసవి సెలవులు కావడంతో చదువుకు ఇబ్బంది కాలేదు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నా. చదువే నా ప్రపంచం’ అంటున్నది మనస్విని.
…? సామల గట్టు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

