Sharwanand | 1960 నాటి తెలంగాణ కథ ‘భోగి’.. సంపత్‌నంది దర్శకత్వంలో శర్వానంద్
1960ల నాటి ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. బుధవారం నుంచి షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
Sharwanand | 1960ల నాటి ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. బుధవారం నుంచి షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. విధి, పోరాటం, మార్పు అంటూ దర్శకుడు కథను నరేట్ చేస్తుండగా..హీరో శర్వానంద్ ఆయన మాటల్ని ఆసక్తిగా వింటూ ఓ యుద్ధం, సంఘర్షణతో కూడిన ప్రపంచాన్ని ఊహిస్తుంటాడు.
తిరుగుబాటుదారుడి వీరోచిత పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తమని అర్థమవుతున్నది. ‘ప్రతి రక్తపు చుక్కకు ఓ కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది’ అని దర్శకుడు సంపత్‌నంది ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జరిగే కథాంశమిదని, అప్పటి కాలమాన పరిస్థితులకు అద్దంపట్టేలా అద్భుతమైన సెట్స్‌కు రూపకల్పన చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

