Biker | ఐదు భాషల్లో శర్వానంద్ బైకర్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Biker | థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకున్న బైకర్ ఇక ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Biker | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన చిత్రం బైకర్ (Biker). అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36 ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించింది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రంలో యాంగ్రీ యంగమ్యాన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు.
చాలా కాలం తర్వాత శర్వా ఖాతాలో మంచి హిట్ పడింది. థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకున్న బైకర్ ఇక ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మే 1న ఈ హై ఆక్టేన్ స్పోర్ట్స్ డ్రామా ప్రీమియర్ కానుంది. మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ప్రీమియర్ కానుంది. హిందీలో శర్వా టైటిల్లో విడుదల కానుంది.
ఇక్కడ ప్రతీ బైకర్‌కు ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ.. చావుకు ఎదురెళ్లే కథ.. ఏం జరిగినా పట్టువదలని మొండోళ్ల కథ అంటూ బైక్ రేసింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. బైకర్‌లో డాక్టర్ రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించగా… బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.
📢 Official Announcement 💥 #Biker 🏍️(Telugu) Streaming from May 1 on Netflix in Telugu, Tamil, Kannada & Malayalam 🍿!!
In Hindi also Titled as #Sharwa !!#OTT_Trackers pic.twitter.com/5y8fqUTj6h
— OTT Trackers (@OTT_Trackers) April 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

