నాకు ఇష్టమైన ఫొటో ఇదే

డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో శృతిహాసన్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. హజారికాతో శృతిహాసన్ సన్నిహితంగా ఉన్న పలు ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. అతడితో ఉన్న అనుబంధంపై శృతిహాసన్ మాత్రం ఇప్పటివరకు పెదవివిప్పలేదు. ప్రస్తుతంలాక్డౌన్ విరామాన్ని ప్రియుడితో కలిసి శృతిహాసన్ ఏకాంతంగా ఆస్వాదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల శృతిహాసన్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఫొటోల్లో శంతను కనిపించడంతో వారిద్దరూ కలిసి ఉంటున్నది నిజమేనంటూ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాజాగా బుధవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది శృతిహాసన్. ఈ సందర్భంగా ఇప్పటివరకు సోషల్‌మీడియాలో షేర్ చేయని మీకు బాగా ఇష్టమైన ఫొటో ఏది? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ బదులిస్తూ శంతను హజారికను వెనకనుండి తాను కౌగిలించుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోను చూసిన వారంతా శంతనుతో ప్రేమలో ఉన్న విషయాన్ని శృతిహాసన్ తెలివిగా చెప్పిదంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

