బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘పఠాన్’. దీపికా పడుకోన్ కథానాయిక. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది. ‘పఠాన్’ తన కెరీర్లో ఎందుకు ప్రత్యేకమైన సినిమానో వివరించారు షారుఖ్. ఆయన మాట్లాడుతూ…‘నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఇలాంటి యాక్షన్ మూవీలో నటించాలని ఆశపడ్డాను. వాస్తవంగా ఒక మంచి యాక్షన్ మూవీ చేసేందుకు నాకు 30 ఏళ్లు పట్టింది.
నా 56 ఏళ్ల వయసులో కోరుకున్న తరహా మూవీలో నటిస్తున్నాను. ఈ వయసులో యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం గర్వంగా ఉంది. ఈ భారీ పోరాట సన్నివేశాల్లో నటించేందుకు బాడీ సపోర్ట్ చేస్తున్నది. దర్శకుడు సిద్ధార్థ్‌తో సినిమా చేయాలని చాలా సార్లు అనుకున్నా ‘పఠాన్’తో మా కాంబో కుదరడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు.