Shanmukha Movie | దీపావళికి ముస్తాబవుతున్న ఆది డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’
Shanmukha Movie | తెలుగులో మంచి కంటెంట్‌తో వచ్చిన డివోషనల్ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ వుంటుందన్న విషయం తెలిసిందే. అయితే తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది.
Shanmukha Movie | తెలుగులో మంచి కంటెంట్‌తో వచ్చిన డివోషనల్ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ వుంటుందన్న విషయం తెలిసిందే. అయితే తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతున్న మరో పాన్ ఇండియా సూపర్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. పవర్ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు.
శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ అందరిలోనూ ఉత్కంఠను ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్ చూసిన అందరిలోనూ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ దీపావళి సీజన్లో ఫ్యామిలీ చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇది. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలుకానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు.
ALso Read..
- Ratna Bhandar: పూరి జగన్నాథ్ రత్నభండార్‌లో రెండో సర్వే షురూ..
- Prakash Raj – Manchu Vishnu | మంచు విష్ణుకి ‘శివయ్యా’ అంటూ కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్.. ఎందుకంటే.?
- BJP Mayor fakes blood donation | రక్త దానం చేసినట్లు నటించిన బీజేపీ మేయర్.. వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

