Shanmukh Jaswanth |ఎట్టకేలకు బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్.. టాప్ రెమ్యునరేషన్ ఇతనికేనా

Shanmukh Jaswanth | అనుకున్నట్లుగానే షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ 5 తెలుగులోకి వచ్చాడు. యూ ట్యూబ్ స్టార్స్‌కు ఏం ఫాలోయింగ్ ఉంటుందిలే అనుకునే వాళ్లకు షణ్ముఖ్ జస్వంత్‌ను చూపిస్తే సరిపోతుంది. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫాలోయింగ్ మనోడి సొంతం. వాళ్లు వెండితెరపై రప్ఫాడిస్తుంటే.. మనోడు బుల్లితెరను షేక్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్‌లో అయితే షన్ను వీడియో వస్తే రికార్డులు బద్దలైపోతాయి. ఈయన నటించిన సూర్య, సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌లు అనుకున్న దానికంటే ఎక్కువ విజయమే సాధించాయి. దాంతో షణ్ముఖ్ ఇమేజ్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈయనకు ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది. దీన్ని కరెక్టుగా వాడుకోవాలని చూస్తున్నాడు ఈ కుర్రాడు. తనకున్న ఫాలోయింగ్ లెక్కలేసుకుని మరీ.. బిగ్ బాస్ నిర్వాహకులకు తన రేటుతో చుక్కలు చూపించాడని తెలుస్తుంది.

ఈయన అడిగిన మొత్తం విని ముందు షాక్ అయినా కూడా తర్వాత తమకు వచ్చే లాభాలు.. షణ్ముఖ్ ఇంట్లో ఉంటే వచ్చే టీఆర్పీ రేటింగ్ అన్నీ బేరీజు వేసుకుని అడిగినంత ఇచ్చేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా సిద్ధమయ్యారు. దాంతో ఐదో సీజన్లో మోస్ట్ క్రేజీయెస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. ఇప్పటి వరకు ఏ యూ ట్యూబ్ స్టార్‌కు.. అలాగే బిగ్ బాస్ హిస్టరీలోనే మరే కంటెస్టెంట్‌కు ఇవ్వనంత పారితోషికం మాత్రం షణ్ముక్ కు బిగ్ బాస్ మేకర్స్ ఇస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఈ అమౌంట్ లక్షల్లో ఉండొచ్చు.. కోట్లు కూడా ఉండొచ్చనేది అందుతున్న సారాంశం. ఇప్పటి వరకు శ్రీముఖి మాత్రమే కోటికి చేరువగా పారితోషికం అందుకుంది. ఇప్పుడు దీన్ని షణ్ణు బీట్ చేసేలా కనిపిస్తున్నాడు.
ఇప్పుడు షణ్ముఖ్ కూడా ఇదే స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్నాడు. దాంతో ఈయనకు కూడా భారీగానే పారితోషికం అందుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా మా టీవీ యాజమాన్యం షణ్ముఖ్ వస్తే బిగ్ బాస్ 5 తెలుగుకు మరింత రీచ్ పెరుగుతుందని గట్టిగా నమ్ముతుంది. ఎందుకంటే యూ ట్యూబ్ ఫాలోయర్స్ షణ్ముఖ్‌కు అలా ఉన్నారు మరి. అందుకే ఈయన్ని వదులుకోకుండా అడిగినంత ఇచ్చి మరీ తీసుకొచ్చారు. హూ ఆర్ యూ అంటూ షణ్ముఖ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ 5 తెలుగులో మోస్ట్ క్రేజీయెస్ట్ మాత్రమే కాదు.. స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లలో షణ్ముఖ్ అందరికంటే ముందున్నాడు. మరి చూడాలి.. ఈ యూ ట్యూబ్ సెన్సేషన్ బిగ్ బాస్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో..? అన్నట్లు ఈయన ప్రేయసి దీప్తి సునయన రెండేళ్ల కిందే బిగ్ బాస్ ఇంటికి వెళ్లొచ్చింది. సీజన్ 2లో ఈమె కంటెస్టెంట్. ఇప్పుడు ప్రియుడు ఇంట్లోకి వెళ్లాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
ఆ షాట్ తర్వాత బాగా ఏడ్చేశా.. ఎమోషన్ అయిన రాశీ ఖన్నా
Bigg boss 5 telugu | బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటి కంటెస్టెంట్ ఎంట్రీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

