Shankar Dada Mbbs | రీ-రిలీజ్‌ల ట్రెండ్ నెమ్మదిగా తగ్గుతుంది.. వాటిపై క్రేజ్ కూడా పడిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఏదో ఒక సినిమా వచ్చి మళ్లీ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ఆ మధ్య ఈ నగరానికి ఏమైంది సినిమా టైమ్‌లో అంతే. అంతకు ముందు రీ-రిలీజైన రెండు, మూడు సినిమాలు కనీసం థియేటర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయాయి. దాంతో కొన్ని రోజులుగా రీ-రిలీజ్‌ల ఊసే కనిపించలేదు. కొంచెం గ్యాప్ తర్వాత ఈ నగరానికి ఏమైంది రీ-రిలీజై ఊహించని స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. దాంతో మళ్లీ రీ-రిలీజ్ ట్రెండ్ షురూవైంది. అయితే ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ మరో బ్లక్ బస్టర్ మూవీ రీ-రిలీజ్‌కు సిద్దమవుతుంది.
శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada Mbbs) ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇరవై ఏండ్ల క్రితం వచ్చిన ఈ మూవీ చిరు ఫ్యాన్స్‌కు స్పెషల్. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. తెలుగులో కోట్లు కొల్లగొట్టింది. బాస్ కామెడీ టైటింగ్కు ఫ్యాన్సే కాదు సగటు అభిమాని సైతం ఫిదా అయ్యాడు. ముఖ్యంగా చిరు, శ్రీకాంత్ కామెడీ ఓ రేంజ్లో పేలింది. కాగా ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్‌కు సిద్దమవుతుంది.
Nov 4న #ShankarDadaMBBS Re-release! #Chiranjeevi pic.twitter.com/OpaQ6qRROc
— Rajesh Manne (@rajeshmanne1) October 15, 2023
నవంబర్ 4న గ్రాండ్‌గా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక బాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లక్ బస్టర్‌గా నిలిచిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించగా.. పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అప్పట్లో ఛార్ట్ బస్టర్‌గా నిలిచింది.