మరో సౌత్ రీమేక్‌లో?
‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్' విజయంతో దక్షిణాది కథలపై మక్కువ పెంచుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్‌కపూర్.
‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’ విజయంతో దక్షిణాది కథలపై మక్కువ పెంచుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్‌కపూర్. ఆ సినిమా అనంతరం చేసిన ‘జెర్సీ’ హిందీ రీమేక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేకపోయినా, షాహిద్ నటనకు మాత్రం మంచి పేరొచ్చింది. తాజాగా షాహిద్‌కపూర్ మరో సౌత్ రీమేక్‌లో నటించబోతున్నట్లు తెలిసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మలయాళ చిత్రం ‘ముంబయి పోలీస్’ (2013) హిందీ రీమేక్‌కు షాహిద్‌కపూర్ అంగీకరించినట్లు సమాచారం. మాతృకకు దర్శకత్వం వహించిన రోషన్ ఆండ్రూ హిందీ వెర్షన్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. పోలీస్ కథాంశం నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మలయాళంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే హిందీ రీమేక్‌కు షాహిద్‌కపూర్ సిద్ధమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

