Shahana Goswami | తనకంటే 21 ఏళ్లు పెద్దవాడైన మిలింద్ సోమన్‌తో బ్రేకప్.. ఎట్టకేలకు నోరు విప్పిన బాలీవుడ్ నటి
Milind Soman | ప్రముఖ మోడల్, నటుడు, ఫిట్నెస్ ఐకాన్ మిలింద్ సోమన్‌తో తనకున్న పాత ప్రేమాయణం గురించి ఎట్టకేలకు నోరు విప్పింది బాలీవుడ్ నటి షహానా గోస్వామి.
Milind Soman | ప్రముఖ మోడల్, నటుడు, ఫిట్నెస్ ఐకాన్ మిలింద్ సోమన్‌తో తనకున్న పాత ప్రేమాయణం గురించి ఎట్టకేలకు నోరు విప్పింది బాలీవుడ్ నటి షహానా గోస్వామి. ఇటీవల ఒక వీడియో పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్న ఆమె తన రిలేషన్షిప్ విషయాల గురించి, మిలింద్‌తో బ్రేకప్ గురించి పంచుకుంది. తాను మొదట్లో మిలింద్కు ఒక అభిమానిని అని, ఆ ఆరాధన నుంచి మొదలైన మా ప్రయాణం డేటింగ్ వరకు ఎలా వెళ్లిందో షహానా చెప్పుకోచ్చింది.
నాకు 16-17 ఏళ్ల వయసున్నప్పుడు ఢిల్లీలో మిలింద్ నటించిన ఒక సినిమాను చూసి ఆయన మాయలో పడిపోయాను. ఎలాగైనా ఆయనతో మాట్లాడాలని ఇంటర్నెట్లో వెతకగా, మిలింద్ ల్యాండ్‌లైన్ నంబర్ దొరికింది. ఆ నంబర్‌కు ఫోన్ చేయగా.. పేజర్ మెషీన్లో మిలింద్ తన మొబైల్ నంబర్‌ను వదిలివెళ్లారు. ఆ నంబర్‌కు షహానా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేయగా, మిలింద్ వెంటనే స్పందించారు. అయితే, ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోలేదు, కేవలం మెసేజ్‌ల ద్వారానే టచ్‌లో ఉన్నారు. కాలేజీ చదువుల కోసం షహానా ముంబైకి వచ్చిన తర్వాత, ఇద్దరూ సింగిల్‌గా ఉన్న సమయంలో మళ్లీ కలిసి డేటింగ్ ప్రారంభించారు. మిలింద్ సోమన్‌తో డేటింగ్ చేసే సమయానికి ఆతడి వయసు 43 ఏళ్లు కాగా, షహానా 20లలో ఉంది. అయితే వీరి డేటింగ్‌పై అప్పట్లో విమర్శలు రాగా.. దీనిపై షహానా స్పందిస్తూ.. నేను ఆ వయసు తేడాను ఎప్పుడూ గుర్తించలేదు. నా వయసు కంటే నేను చాలా ఉన్నతంగా ఆలోచించేదాన్ని. మా కుటుంబంలో కూడా అందరం స్నేహితుల్లా ఉంటాం కాబట్టి ఈ విషయం ఇంట్లో చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని పేర్కొన్నారు.
ఇక 2013లో వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని షహానా బయటపెడుతూ.. చివరి క్షణం వరకు మా ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది. కానీ కొన్నిసార్లు బంధాలు అనుకున్నట్లు సాగనప్పుడు వాటిని వదిలేయడమే మంచిది. నేను సాంప్రదాయ బంధాలలో ఇమడలేనని నాకు అర్థమైంది. నేను ప్రేమిస్తాను, కానీ స్వేచ్ఛను అంతకంటే ఎక్కువగా కోరుకుంటాను. ఒకరిని బంధించి ఉంచడం ప్రేమ అనిపించుకోదు. మా ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉన్నాయని, భవిష్యత్తుపై మా అంచనాలు కలవడం లేదని గ్రహించి పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అని షహానా చెప్పుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

