DUNKI | కెనడా వలసదారుల కథేనా?.. షారుఖ్‌ఖాన్ ‘డంకీ’ స్టోరీపై ఆసక్తికరమైన చర్చ
ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు విషయంలో భారత్-కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ‘డంకీ’ కథ గురించి సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది.
DUNKI | ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు విషయంలో భారత్-కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ‘డంకీ’ కథ గురించి సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. భారత్ నుంచి కెనడాకు వెళ్లే అక్రమ వలసదారుల ఇతివృత్తంతో దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై చిత్ర సన్నిహిత వర్గాలు స్పందించాయి. భారత్-కెనడా దేశాలతో ఈ కథకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. ‘డంకీ ఫ్లైట్’ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే కథ ఇది.
భారత్ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లేవారు డంకీ ఫ్లైట్ అనే మార్గాన్ని అనుసరిస్తారు. అలా ఉన్నత జీవితాన్ని కాంక్షిస్తూ విదేశాలకు వెళ్లే వలసదారుల కష్టనష్టాల గురించి ఈ సినిమాలో చర్చించాం. కెనడాలో స్థిపరడిన ప్రవాస భారతీయుల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదు. గొప్ప జీవితం కోసం తపించే కథానాయకుడి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కథ సాగుతుంది. ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి పోకుండా ఈ సినిమాను తెరకెక్కించాం’ అని చిత్రబృందం వివరణ ఇచ్చింది. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న భారీ స్థాయిలో విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

