Pathaan | షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో.. బాక్సాఫీస్ వద్ద పఠాన్ దూకుడు
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన పఠాన్ (Pathaan) చిత్రం మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది పఠాన్ .
జనవరి 25న పఠాన్ (Pathaan) తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఈ చిత్రం మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. పఠాన్ విడుదలైన తర్వాత హిందీలో కార్తీక్ ఆర్యన్ నటించిన షెహ్జాదా, అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు రీమేక్ సినిమాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్నాయి.
ఈ రెండు చిత్రాలు విడుదలైన కొన్ని రోజుల్లోనే థ్రియాట్రికల్ రన్ ముగిసే వరకు వచ్చిందంటే వాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది మాత్రం పఠాన్‌కు బాగా కలిసొచ్చింది. షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షోలా ఆరవ వీకెండ్లోనూ తన హవా కొనసాగిస్తున్నాడు. తాజా ట్రేడ్ సర్కిల్ టాక్ ప్రకారం శనివారం పఠాన్ 2.05 కోట్లు వసూళ్లు చేసింది. ఇవి శుక్రవారం కలెక్షన్లతో పోలిస్తే రెట్టింపు కావడం విశేషం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఐదో వీకెండ్ కంటే ఉత్తమంగా పఠాన్ ప్రదర్శితం అవుతుండటం.
వచ్చే బుధవారం రణ్ బీర్ కపూర్-శ్రద్దాకపూర్ నటించిన Tu Jhoothi Main Makkar విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పఠాన్ థియేటర్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అయితే ఇప్పటికే పఠాన్ హిందీలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు నమోదు చేసింది. మరి ఈ సినిమా రికార్డులను ఏ మూవీ బద్దలు కొడుతుందనేదే పాయింట్. రాబోయే రోజుల్లో ఏ సినిమా పఠాన్ రికార్డులను బ్రేక్ చేస్తుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. పఠాన్ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచింది.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం, సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో పఠాన్ చిత్రాన్ని తెరకెక్కించింది.
Read Also :
Nagarjuna | క్రేజీ టాక్.. నాగార్జున టీంతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్..!
Kushi | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి కొత్త షెడ్యూల్ అఫీషియల్ అప్డేట్
Oo Antava Mava | ఉ అంటావా మావా మేనియా రిపీట్.. డీజే మార్టిన్‌తో అల్లు అర్జున్ డ్యాన్స్
Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్డేట్.. అహింస రిలీజ్ టైం ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

