‘జవాన్’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ ‘డంకీ’ షూటింగ్లో బిజీగా ఉన్న షారుఖ్‌ఖాన్.. షూటింగ్ విరామంలో సరదాగా తన ట్విటర్ ఓపెన్ చేశారు. అభిమానులతో పిచ్చాపాటీ మొదలుపెట్టారు. ఇంతలో ఓ అమ్మాయి మీ చొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా? అని అడగ్గా.. ‘కుడివైపుదా? ఎడమవైపుదా? అంటూ కొంటెగా సమాధానమిచ్చారు కింగ్‌ఖాన్.
‘డంకీ’ సినిమా గురించి అడగ్గా “ ‘డంకీ’ నాకు ప్రత్యేకమైన సినిమా. రాజ్‌కుమార్ ఇరానీసార్ కథల్లో ఉద్వేగాలు వేరుగా ఉంటాయి. పఠాన్, జవాన్ వేరు ‘డంకీ’ వేరు. నిజజీవితానికి దగ్గరగా ఉండే సినిమా ఇది. కొన్ని సినిమాలు చేస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ‘డంకీ’ నాకలాంటి సినిమా” అని చెప్పుకొచ్చారు షారుఖ్.