Shah Rukh Health Update | అహ్మదాబాద్ ఆసుపత్రిలోనే షారుక్ ఖాన్.. ఎస్పీ ఏమన్నారంటే..?
Shah Rukh Health Update | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారీ ఎండలు, వడగాలులతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
Shah Rukh Health Update | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారీ ఎండలు, వడగాలులతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, నటుడు స్వల్ప చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ, షారుక్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాలేదని తెలిసింది. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న షారుక్ ఖాన్ ఇవాళ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
అయితే, బాలీవుడ్ నటుడి ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. షారుక్ మల్టీ స్పెషాలిటీ కేడీ ఆసుపత్రిలో చేరారు. ఐపీఎల్లో భాగంగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. కేకేఆర్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆటగాళ్లతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అదేరోజు అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ ఓం ప్రకాశ్ జాట్ మాట్లాడుతూ షారుక్ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇవాళ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

