ఏఐతో ‘శారీ’ సంగీతం
రామ్‌గోపాల్‌వర్మ డెన్ నుంచి ‘శారీ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతున్న విషయం తెలిసిందే. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రవివర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లు. నవంబర్‌లో సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఈ సినిమా ద్వారా ఓ కొత్త ప్రయోగానికి రామ్‌గోపాల్‌వర్మ శ్రీకారం చుట్టారు.
రామ్‌గోపాల్‌వర్మ డెన్ నుంచి ‘శారీ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతున్న విషయం తెలిసిందే. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రవివర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లు. నవంబర్‌లో సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఈ సినిమా ద్వారా ఓ కొత్త ప్రయోగానికి రామ్‌గోపాల్‌వర్మ శ్రీకారం చుట్టారు.
ఆర్టిఫిషల్ ఇంటలిజన్స్(ఏఐ) ప్రస్తుతం సాంకేతిక విప్లవానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ కృత్రిమమేథ సప్తస్వరాలతో విన్యాసాలు చేస్తూ సంగీతకారులందరికీ సవాలు విసురుతోంది. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన ‘శారీ’ చిత్రంలో తొలిసారి ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ప్రక్రియతో మ్యూజిక్ డిపార్టెంట్తో పనిలేకుండా తానే సంగీత, సాహిత్య, వాయిద్య మేళవింపుగా పాటను తయారు చేశారు. ‘ఐ వాంట్ లవ్..’ అంటూ సాగే ఈ పాటను ఆదివారం ఉదయం విడుదల చేశారు.
భారత చలనచిత్ర చరిత్రలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ప్రక్రియ ద్వారా తయారైన తొలి సినిమా పాట ఇదే కావడం విశేషం. ఇకపై భవిష్యత్‌లో సంగీత దర్శకులు, పాటలు రాసేవాళ్లు, పాడేవాళ్లు చరిత్రగా మిగిలిపోతారనీ, రూపాయి ఖర్చు లేకుండా ఏఐ యాప్ ద్వారా సంగీతాన్ని తమకు ఇష్టమైన ట్యూన్స్‌లో సమకూర్చుకోవడమే కాక, వాటిని తమకు ఇష్టమైన వాయిస్‌లో క్షణాల్లో రికార్డ్ చేసుకోవచ్చని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శబరి, నిర్మాణం: ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

