Shanmukh Jaswanth | అన్నదమ్ములిద్దరూ మోసం చేశారు.. షణ్ముక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
Shanmukh Jaswanth | బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షార్ట్ ఫిలిం ఛాన్స్‌లు ఇప్పిస్తానని షణ్ముక్ మోసం చేస్తే.. ప్రేమ పేరుతో అతని సోదరుడు సంపత్ వాడుకున్నాడని బాధితురాలు వాపోయింది.
Shanmukh Jaswanth | బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైజాగ్‌కు చెందిన ఓ యువతిని షార్ట్ ఫిలిం ఛాన్స్‌లు ఇప్పిస్తానని షణ్ముక్ మోసం చేస్తే.. ప్రేమ పేరుతో అతని సోదరుడు సంపత్ వాడుకున్నాడు. పదేండ్ల పాటు వాడుకున్న తర్వాత ఇప్పుడు సంపత్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవ్వడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లగా.. అనుకోని విధంగా షణ్ముక్ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ క్రమంలో కేసుకు సంబంధించి బాధితురాలు పలు కీలక విషయాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. షార్ట్ ఫిలింస్‌లో ఛాన్స్ ఇప్పిస్తానని షణ్ముక్ జస్వంత్ వైజాగ్‌కు చెందిన ఓ యువతిని మోసం చేశాడు. షణ్ముక్ ద్వారానే తన సోదరుడు సంపత్ వినయ్‌కు పదేండ్ల క్రితం పరిచయమైంది. సదరు యువతిని ప్రేమిస్తున్నానని సంపత్ వినయ్ వెంటబడ్డాడు. మాయమాటలు చెప్పి హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పెండ్లి చేసుకోమని సంపత్‌ను బలవంతపెట్టగా.. ఒక రింగ్ చేతికి పెట్టి పెళ్లి అయిపోయిందని నమ్మించాడు. సదరు యువతికి బలవంతంగా ఒకసారి గర్భం కూడా తీసేయించాడు. అబార్షన్ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని సంపత్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు చేస్తే.. శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించాడు. ఇప్పుడు మంచి సంబంధం రావడంతో వేరే అమ్మాయితో సంపత్ పెళ్లికి ఫిక్సయ్యాడు. ఈ విషయం తెలిసి షాకైన బాధితురాలు సంపత్ వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారితో కలిసి సంపత్ ఫ్లాట్‌కు వెళ్లింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని షణ్ముక్ నివాసానికి వెళ్లారు. కానీ ఆ సమయానికి షణ్ముక్, సంపత్ గంజాయి తీసుకుంటూ కనిపించారు. అది చూసిన బాధితురాలు ఆ దృశ్యాలను వీడియో తీసింది. కాగా, షణ్ముక్ దగ్గర దొరికిన గంజాయి, మత్తు పద్థాలను పోలీసులు సీజ్ చేశారని ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. సంపత్ వినయ్ మీద చీటింగ్, రేప్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 16 గ్రాముల గంజాయి దొరకడంతో షణ్ముక్‌ను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నామని చెప్పారు.
కాగా, షణ్ముక్ దగ్గర గంజాయితో పాటు డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్‌కు సంబంధించి తన దగ్గర వీడియో ప్రూఫ్‌లు కూడా ఉన్నాయని పేర్కొంది. తమను చూడగానే కిందకు వెళ్లిపోమని షణ్ముక్ బలవంతపెట్టాడని తెలిపింది. జావెద్ అనే కానిస్టేబుల్ కూడా షణ్ముక్‌కు సహకరించేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. తనను కాంప్రమైజ్ అవ్వమని కానిస్టేబుల్ జావెద్ ఒత్తిడి తీసుకొచ్చాడని పేర్కొంది. తనకు న్యాయం జరగాలని, తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

