సీనియర్ నటి జయంతి కన్నుమూత
సీనియర్ నటి జయంతి| దక్షిణాది చలన చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల స్వాస సంబంధిత సమస్యతో బెంగళూరులోని విక్రమ్ దవాఖానలో చికిత్స పొందారు.

హైదరాబాద్: దక్షిణాది చలన చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల స్వాస సంబంధిత సమస్యతో బెంగళూరులోని విక్రమ్ దవాఖానలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో 76 ఏండ్ల జయంతి తన స్వగృహంలో కన్నుమూశారు.

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయంతి.. 1945 జనవరి 6న కర్ణాటకలోని బళ్లారిలో జన్మించారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతోపాటు హిందీ, మరాఠీ సినిమాలతో కలిపి 5 వందలకుపైగా సినిమాల్లో నటించారు.

తెలుగులో జగదేకవీరునికథ, డాక్టర్ చక్రవర్తి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, రక్త సంబంధం, భక్త ప్రహ్లాద, బడిపంతులు, దేవదాసు, మాయదారి మల్లిగాడు, స్వాతి కిరణం, పెదరాయుడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దిగ్గజ నటులు ఎంజీ రామచంద్రన్, ఎన్టీఆర్, రాజ్‌కుమార్, రజనీకాంత్‌లతో కలిసి నటించారు. ఉత్తమ నటిగా రెండుసార్లు కర్ణాటక ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. జయంతి మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

