Selfiee Movie | అక్షయ్ కుమార్ సెల్ఫీ స్పెషల్ సాంగ్ రిలీజ్.. బికినీలో మృణాల్ హాట్‌షో..!
రోటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ బాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు అక్షయ్ కుమార్. అంతేకాకుండా ఏ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.
Selfiee Movie | బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన సినిమాలు తెలుగులో ఎక్కువగా రిలీజ్ కాకపోయినా.. హిందీ సినిమాలతోనే టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రోటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ బాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అక్షయ్, ఏ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. గతేడాది అక్షయ్ ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే అందులో ఏ ఒక్క సినిమా కూడా హిట్లు కాలేకపోవడం గమనార్హం. ప్రస్తుతం అక్షయ్ అశలన్నీ ‘సెల్ఫీ’ పైనే ఉన్నాయి.
రాజ్మెహ్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. సెలబ్రెటీ పాత్రలో అక్షయ్ నటించగా.. పోలీస్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని కుడియే ని తేరి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక గీతంలో అక్షయ్‌తో కలిసి మృణాల్ థాకూర్ స్టెప్పులేసింది. ఈ పాటలో మృణాల్ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఒలకబోస్తూ యూత్‌లో హీట్ పెంచుతుంది. తాజాగా రిలీజైన ఈ పాట నెట్టింట తెగవైరల్ అవుతుంది.
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుష్రత్ భరుచ్చా, డయానా పెంటీ హీరోయిన్లుగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంస్థలతో కలిసి మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 24న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

