కబడ్డీ ఆట నేపథ్యంలో ‘సీటీమార్’ కథ సాగుతుంది. లక్ష్య సాధనకు తెలంగాణ, ఆంధ్రా కబడ్డీ టీమ్‌లు చేసిన అలుపెరుగని పోరాటమేమిటన్నది ఉద్వేగాన్ని పంచుతుంది’ అని అన్నారు సంపత్‌నంది. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. సెప్టెంబర్ 3న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఇందులో తమన్నా, గోపీచంద్‌లు తెలంగాణ, ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్‌లుగా కనిపిస్తారు. వారి పాత్ర చిత్రణ నవ్య పంథాలో ఉంటుంది. పాటలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. వాణిజ్య అంశాలు మేళవించిన స్పోర్ట్స్ డ్రామాగా అందరిని మెప్పిస్తుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అన్నారు. దిగంగన సూర్యవన్షీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్‌రాజన్, సంగీతం: మణిశర్మ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.