Sita Kalyana Vaibhoham | సుమన్తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. రాచాల యుగంధర్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ బుధవారం కొత్త లుక్ను విడుదల చేశారు. ‘అందమైన ప్రేమకథా చిత్రమిది.
హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో పాటు యాక్షన్ హంగులతో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినూత్న ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పరశురామ్, సంగీతం: చరణ్ అర్జున్, దర్శకుడు: సతీష్ పరమవేద.