Ma Oori Polimera 2 | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. సత్యంరాజేశ్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర (Ma Oori Polimera). డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరోసారి అందరికీ థ్రిల్ అందించేందుకు సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2) రెడీ అవుతోంది.
గెటప్ శీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహిత్య దాసరి, రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పాపులర్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి సినిమా హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్టు సమాచారం. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత గౌరీ కృష్ణ తెలిపారు. పల్లెటూరి నేపథ్యంలో బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగే టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేశామన్నాడు. సత్యం రాజేష్, కామాక్షి అద్భుతంగా నటించారని అన్నారు.
మా ఊరి పొలిమేర 2 టీజర్..
1️⃣ Million + View’s for #MaOoriPolimera2 Teaser !
ICYMI : https://t.co/tkBjReihNn @Satyamrajesh2 #KamakshiBhaskarla @GowrKriesna #ShreeKrishnaCreations @sahithidasari7 @DrAnilViswanath @getupsrinu3 #Gyaani @RKushendar #SreeVara @Gkcinemapro pic.twitter.com/ruQDpxMVA6
— Sreedhar Sri (@SreedharSri4u) July 4, 2023