Saripodhaa Sanivaaram | యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో హీరో నాని నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. కోపాన్ని శనివారానికి మాత్రమే పరిమితం చేసిన ఓ వెరైటీ కుర్రాడి కథ ఇది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తున్నది. చిన్న విరామం తర్వాత నేటినుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.
నానితోపాటు ఇతర తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తారని నిర్మాతలు చెప్పారు. నానితో దర్శకుడు వివేక్ ఆత్రేయ చేసిన తొలి సినిమా ‘అంటే సుందరానికి’. అందులో నాని సాఫ్ట్‌గా కనిపించారు. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా ఇందులో కనిపిస్తాడని నిర్మాతలు తెలిపారు. ప్రియాంక అరుల్మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి జి., సంగీతం: జేక్స్ బిజోయ్.