రకుల్‌కు కలిసి రాని అదృష్టం.. మళ్లీ నెగెటివ్ టాక్!

బాలీవుడ్ లో జెండా పాతాలని చాలా మంది సౌత్ హీరోయిన్లకు ఉంటుంది. అందుకే ఇక్కడ్నుంచి అక్కడికి వెళ్లి సినిమాలు చేస్తూనే ఉంటారు. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు రెగ్యులర్ గా చేసే ముద్దుగుమ్మలు మన దగ్గర కొందరున్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ కీలకం. తెలుగుతో పాటు ఎప్పటికప్పుడు హిందీలోనూ నటిస్తుంది ఈ భామ. అక్కడ కూడా ఈమెకు మంచి ఇమేజ్ ఉంది. వరస సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే అక్కడ అజయ్ దేవ్గన్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించింది రకుల్. అసలే మన హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అన్నిచోట్లా సినిమాలు చేస్తుంటారు. రకుల్ కూడా అంతే. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ వరస సినిమాలు చేస్తూనే ఉంది. అయితే విజయాలు మాత్రం రావడం లేదు.
తెలుగులో బాగానే సక్సెస్ అయినా కూడా హిందీలో మాత్రం బ్రేక్ రావడం లేదు. అక్కడ భారీ సినిమాలు చేసినా కూడా ఇప్పటి వరకు హిట్ కొట్టలేకపోయింది. తొలి సినిమా యారియాన్ మినహాయిస్తే మరో హిట్ రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన అయ్యారే, దే దే ప్యార్ దే లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమాతో వచ్చింది ఈమె. అర్జున్ కపూర్ హీరోగా నటించిన సర్దార్ కీ గ్రాండ్ సన్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం, అదితిరావు హైదరి, నీనా గుప్తా లాంటి స్టార్స్ నటించారు. నిజానికి ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయాలనుకున్నా పరిస్థితులు అనుకూలింకచకపోవడంతో ఓటిటిలో విడుదల చేసారు.
ఈ సినిమాను చూసిన వాళ్ళంతా పెదవి విరుస్తున్నారు. సినీ విశ్లేషకులు అయితే సినిమాను ఆడుకుంటున్నారు. మరోవైపు ఆడియన్స్ కూడా సినిమాలో విషయం లేదని తేల్చేసారు. కథ బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే లోపాలతో సినిమా నిరాశ పరిచిందని తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా రకుల్ గురించి కూడా చెప్పుకోడానికి ఏం లేదని తెలుస్తుంది. ఈమె కారెక్టర్ కూడా తేలిపోయింది. దాంతో ఎలాగోలా బాలీవుడ్ లో వెలిగిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న రకుల్ కు మరోసారి నిరాశనే మిగిల్చాడు సర్దార్ కీ గ్రాండ్ సన్.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

