Sarat Mandava | వేణుకు ఫోన్ చేస్తే..సినిమాలు మానేశానన్నారు..రవితేజ టీంతో చిట్‌చాట్
రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)తో సిల్వర్ స్క్రీన్కు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీఐ మురళీగా కనిపించనున్నాడు వేణు. చిట్‌చాట్‌లో వేణును ఎలా ఎంపిక చేశాడో చెప్పాడు శరత్ మండవ.
అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి (Venu Thottempudi)మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja) నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)తో సిల్వర్ స్క్రీన్కు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీఐ మురళీగా కనిపించనున్నాడు వేణు. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వేణు, శరత్ అండ్ టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా జరిపిన చిట్‌చాట్‌లో వేణును ఎలా ఎంపిక చేశాడో చెప్పాడు శరత్ మండవ.
‘ ఆయన (వేణు)యాక్టింగ్ ఎందుకొదిలేశారో నాకు తెలియదు. ఆయన్ను అడిగినా చెప్పడేమో. నేను ఆయన్ను టచ్ లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నపుడు..మా ప్రసాద్ ఫోన్ చేశాడు. అస్సలు ఆయన స్పందించడం లేదు. వేణు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మీ డైరెక్టర్‌కు నా పేరు గుర్తున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. కానీ సినిమాలు మానేశానని ప్రసాద్‌తో చెప్పి ఫోన్ పెట్టేశారు. అనంతరం నేను వేణుకు మెసేజ్ పెట్టాను. మనం ఒకసారి కలుద్దామండి..మీరు సినిమా చేసినా..చేయకపోయినా ఫర్వాలేదు. ఒకసారి కలుద్దామని అడిగాను. దానికి మీరెక్కడుంటారని వేణు నన్ను అడిగారు’ .
హోటల్లో కలిశాం..
ఆ తర్వాత వేణు, తాను ఒక హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం కలిశామన్నాడు శరత్. వేణుతో నేను 10-15 నిమిషాలు మాట్లాడి వెళ్దామనుకున్నా..కానీ ఆయనను గంటన్నర సేపు కూర్చునేలా చేశా..ఆయనకు కామన్‌గా తెలిసిన వాళ్లున్నారని.. అక్కడికెళ్లి వేణుకు కథ వినిపించాను. వేణుకు కథ బాగా నచ్చి..వెంటనే ఒకే చెప్పేశారని చెప్పుకొచ్చాడు’ శరత్ మండవ.
దీనిపై వేణు స్పందిస్తూ..నేను చాలా సందేహంగా ఉన్నా..కానీ శరత్ దాన్ని నా మనస్సులో నుంచి పూర్తిగా తొలగించారు. శరత్ ఫుల్ క్లారిటీతో ఉంటాడు. తనకు ఏం కావాలో అది తీసుకుంటాడు..మనం ఏదైనా చెప్పినా కూడా అవసరం లేదంటాడు..అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో సర్పట్టా ఫేం జాన్ విజయ్, చైతన్యకృష్ణ, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Nithiin | మోకాలికి గాయమైనా అంజలి డ్యాన్స్ చేశారు : నితిన్
Read Also : Rashmika Eid Wishes | రష్మిక బక్రీద్ శుభాకాంక్షలు..స్పెషల్ పోస్టర్ రిలీజ్
Read Also : Mahesh Remuneration | రెమ్యునరేషన్ పెంచేసిన మహేశ్..క్రేజీ న్యూస్ నిజమేనా.. !
Read Also : Krishna Vamsi | ఏడెనిమిది సార్లు ఏడ్చేసిన కృష్ణవంశీ..ఎందుకంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

