Sara Ali Khan | అలా ఉండాలని ఫ్రెండ్స్ సలహా ఇస్తుంటారు.. కానీ నావల్ల కాదు.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చిన సారా అలీఖాన్
ఇSara Ali Khan | టీవలకాలంలో వరుసగా దేవాలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నది బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్. ఇటీవల కేథార్నాథ్ ఆలయంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక పూజల తాలూకు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Sara Ali Khan | ఇటీవలకాలంలో వరుసగా దేవాలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నది బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్. ఇటీవల కేథార్నాథ్ ఆలయంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక పూజల తాలూకు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలాంటి దాపరికం లేకుండా తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుందని ఈ భామకు పేరుంది.
ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ స్పందిస్తూ ‘ప్రతి విషయంలో నేను చాలా ఓపెన్‌గా మాట్లాడుతానని, కాస్త లౌక్యంతో వ్యవహరించడం అవసరమని నా కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ కూడా సలహా ఇస్తుంటారు. నిజాయితీగా వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. అందుకే నేను ఎలాంటి భేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. మాటలను ఫిల్టర్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోను. సద్విమర్శలను మాత్రం స్వీకరిస్తా. అందరి మెప్పు పొందాలనే తాపత్రయం వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి. ఈ ప్రపంచంలో ద్వేషించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోను’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె కథానాయికగా నటించిన ‘జరా హట్కే జరా బచ్కే’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

