సైఫ్ ఆలీఖాన్ కుమార్తె, యువ కథానాయిక సారా అలీఖాన్ని ప్రతి ఒక్కరూ ప్రేరణగా తీసుకోవాలి. మనిషి కులమతాలకు అతీతంగా బతకాలని, భారతదేశం అంతా ఒకే కుటుంబమని నమ్మడమేకాక, అందుకు తగ్గట్టుగానే జీవితాన్ని మలచుకుంది సారా. తనలో ఇస్లామ్ మూలాలున్నా.. దేవాలయాలకెళ్లి పూజలు చేస్తూ ఉంటుంది సారా. అలాగే మజీద్కెళ్లి నమాజ్ కూడా చేస్తుంది.. ఈ విషయంపై అందరూ ఆమెను శభాష్ అంటూనే ఉన్నారు.
తన తొలి సినిమా పేరు ‘కేదార్నాథ్’. ఆ సినిమా చేసినప్పట్నుంచీ ‘కేదార్నాథ్’ దేవాలయంపై మక్కువ పెంచేసుకుంది సారా. రీసెంట్గా తను కేదార్ యాత్ర చేసింది. దానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాలో పొందుపరచింది. దీనిపై ఆమె స్పందిస్తూ ‘నా తొలి సినిమా ‘కేదార్నాథ్’. ఆ సినిమా నుంచి కేదారేశ్వరుడంటే నాకిష్టం. బేసిగ్గా మా అమ్మ అమృతాసింగ్ ఈశ్వరభక్తురాలు. ఆమె నుంచే నాకీ శివభక్తి ప్రాప్తించి వుండొచ్చు.’ అంటూ చెప్పుకొచ్చింది సారా అలీఖాన్.