స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు సంజయ్ దత్ (Sanjay Dutt). ఈ సిల్వర్ స్క్రీన్ మున్నాభాయ్ క్యాన్సర్ బారిన పడ్డట్టు తెలిసినా చికిత్స చేయించుకుంటూనే షూటింగ్లో పాల్గొని..ఎంతో మంది నటీనటులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఇటీవలే కేజీఎఫ్ చాఫ్టర్ 2లో అధీరా పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. దత్తూభాయ్లోని నెవర్ గివప్ ఆటిట్యూడ్ కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF: Chapter 2)లో స్పష్టంగా కనిపిస్తుంది.
అధీరా పాత్రలో స్టెల్లార్ యాక్టింగ్‌తో అదరగొట్టిన సంజయ్ దత్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఇంటెన్స్ వర్కవుట్ స్టిల్ నుపోస్ట్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. జిమ్‌లో భారీ చైన్లను పైకి లేపుతూ ఉన్న స్టిల్ ను షేర్ చేస్తూ..నువ్వు గెలిచే దాకా నీ కథ గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకే గెలవండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇపుడు ఈ పోస్టు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న షంషీరా (Shamshera) చిత్రంలో రణ్ బీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్నాడు. దీంతోపాటు రవీనాటాండన్తో ఘూడ్చడి చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేస్తున్న పృథ్విరాజ్ సినిమాలో పృథ్విరాజ్ అంకుల్‌గా అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.