Anakapalli | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ యాక్టర్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’(Anakapalli). ఇంటెన్స్ పల్లెటూరి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. విక్రమ్ సాహిదేవ్ తన సరికొత్త లుక్, పవర్ఫుల్ యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ వేసవి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ మూవీ నుంచి అమ్మోరు దిగినాది సాంగ్‌ను విడుదల చేశారు.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో సీనియర్ నటి సంగీత ఉగ్రరూపం చూడొచ్చు. అగ్రెసివ్‌గా మంగ్లీ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఓ జాతరను చూస్తున్నామా..? అన్నట్టుగా సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌కు కనెక్ట్ అవడం పక్కా అని అర్థమవుతోంది. ఈ మూవీలో త్రినాధరావు నక్కిన, ఇంద్రజ అబ్బర్, మహబూబ్‌నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నాడు. డావ్జాండ్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు.
A sacred anthem echoing pure divine strength. 🔱🔥#Ammorudiginadhi Full Lyrical Video Out Now 🔥
🎬 #Anakapalli Coming to theatres this Summer 2026 🍿@TrinadharaoNak1 #VikramSahidev #SandhyaVasishta @tarakponnappa @Khageshdirector @adityamusic… pic.twitter.com/nd6icd1LiH
— BA Raju’s Team (@baraju_SuperHit) April 29, 2026