నిహాల్, ప్రియాదేశ్పాగ్, అర్జున్ సీహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సందిగ్ధం’ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్య తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశామని, కథలోని కొత్తదనం ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.
ఎన్నో కష్టాలను అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నామని హీరో నిహాల్ అన్నారు. ఈ సినిమాలో మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుందని సంగీత దర్శకుడు గౌతమ్ రవిరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నందన్‌కృష్ణ, సంగీతం: గౌతమ్ రవిరామ్, దర్శకత్వం: పార్థసారధి కొమ్మోజు.