Sandeep Reddy Vanga | నా లైఫ్‌లో అదే ‘రోమాంచకం’.. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా
‘ఈ సినిమా నేను చూశాను. చాలా బావుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించి మెప్పించడం కష్టం. హీరో, హీరోయిన్, వారి స్నేహితుల పాత్రలు చూస్తుంటే సినిమాలా అనిపించదు. పక్కనుంచి వీళ్లను చూస్తున్నట్టు అనిపిస్తుంది. కథ విన్నప్పుడు ఎంతగా నవ్వానో, చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వాను.
‘ఈ సినిమా నేను చూశాను. చాలా బావుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించి మెప్పించడం కష్టం. హీరో, హీరోయిన్, వారి స్నేహితుల పాత్రలు చూస్తుంటే సినిమాలా అనిపించదు. పక్కనుంచి వీళ్లను చూస్తున్నట్టు అనిపిస్తుంది. కథ విన్నప్పుడు ఎంతగా నవ్వానో, చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వాను. మా భద్రకాళి పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రాలన్నింటికీ సెన్సార్ ‘ఏ’ సర్టిఫికెట్లే వచ్చాయి. రాబోతున్న ‘స్పిరిట్’కి కూడా ‘ఏ’ సరిఫికెట్టే వస్తుంది. కానీ ఈ సినిమా వల్ల మా సంస్థకు తొలిసారి క్లీన్ యు/ఏ సర్టిఫికెట్ రానున్నది. సినిమా అంతా ఓ ఫ్లోలో కామెడీతో వెళ్తుంది. ఫ్యామిలీస్‌తో వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. నా లైఫ్‌లో ‘రోమాంచకం’ అంటే ప్రభాస్ అన్నతో సినిమా చేయడమే’ అని అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అన్నారు.
ఆయన సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి వేణుగోపాల్‌రెడ్డి దర్శకుడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్‌రెడ్డి వంగా మాట్లాడారు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారని కథానాయిక అనంతిక సనిల్‌కుమార్ అన్నారు. భద్రకాళీ పిక్చర్స్‌లో రానున్న ఫన్ అండ్ క్యూట్ ఎంటర్టైనర్ ఇదని హీరో సుమంత్ ప్రభాస్ నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా, డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డీవోపీ పవన్ పప్పుల, సంగీత దర్శకుడు వాసుకి వైభవ్, కాస్ట్యూమ్ డిజైనర్ సంకీర్తన కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Rajapeta | గురుకుల పాఠశాలలో మళ్లీ జూనియర్లపై కట్టెలతో సీనియర్ల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

