సంపూర్ణేష్‌బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ చిత్రాన్ని బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఆర్బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు. ఎన్ఆర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సాయికుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్ఆర్ రెడ్డి మాట్లాడుతూ…‘సంపూర్ణేష్ బాబును ఇప్పటిదాకా చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా కథా కథనాలు ఉంటాయి. నాలుగు ఫైట్స్‌ను నలుగురు స్టంట్ మాస్టర్స్‌తో చేయించాం. ఈ నెల 20న చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు. జ్యోతి, చలాకీ చంటి, మిర్చి మాధవి, ఆనంద్ భారతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ముజీర్ మాలిక్, సంగీతం : డేవిడ్. జి