Tees Maar Khan | ‘సమయానికే’ వీడియో సాంగ్ రిలీజ్.. ‘ఆర్ఎక్స్100’ను తలపిస్తున్న రాజ్పుత్పాయల్
Samayanike Video Song | హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘తీస్ మార్ ఖాన్’ ఒకటి. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను స్టార్ చేసింది.
తాజాగా ఈ చిత్రంలోని ‘సమయానికే’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సాయి కార్తిక్ స్వర పరిచిన ఈ మెలోడీ గీతాన్ని శృతి ఆలపించింది. రాకెందుమౌళి సాహిత్యం అందించాడు. ఈ చిత్రంలో ఆదికి జోడీగా రాజ్‌పుత్ పాయల్ హీరోయిన్గా నటించింది. విజయ్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సునీల్, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆది మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. ఒకటి స్టూడెంట్ పాత్ర కాగా మరోకటి రౌడి పాత్ర.. ఇంకోటీ పోలీస్ పాత్ర. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైయ్యాడు.
Read Also:
Pathaan Movie | ‘పఠాన్’ నుండి దీపికా పదుకొనే ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
Bimbisara Movie | ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా స్టార్ హీరో?
NBK 107 | అభిమానితో కలిసి భోజనం చేసిన బాలకృష్ణ.. వైరల్ అవుతున్న వీడియో
Sir Movie | ధనుష్ మూవీ నుండి క్రేజీ అప్డేట్లు.. జోష్‌లో ఫ్యాన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

