Bimbisara Pre-Release Event | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు.
కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 29న శిల్పకళా వేదికలో జరుగునుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఈ వార్త నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతుంది. ఇక బింబిసార చిత్రానికి ఫ్రాంచైజీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కళ్యాణ్‌రామ్ ఇటీవలే తెలిపాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఒక పార్టులో భాగమవుతాడని కూడా చెప్పాడు. బింబిసార చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్, వారినా హుస్సెన్‌లు కథానాయికలుగా నటించారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు ఘన విజయం సాధించాయి.